డాక్టరేట్ అందుకున్న పూజిత
పూజితకు డాక్టరేట్ ప్రదానం
ప్రజాశక్తి -తిరుపతి సిటీ
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ ఫిజియాలజీ విభాగంలో పరిశోధనలు నిర్వహించిన విద్యార్థిని పూజితకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి) పట్టాను ప్రదానం చేసినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పూజిత కూనాటి ఫిజియాలజీ విభాగంలో డాక్టర్ శరన్ బి సింగ్ పర్యవేక్షణలో ది ఎఫెక్ట్ ఆఫ్ హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ ఆన్ వైఠల్ పారమీటర్స్ అండ్ బయోమార్కర్స్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ హెల్తీ ఫీమేల్ మెడికల్ స్టూడెంట్స్ అనే అంశముపై పరిశోధనను నిర్వహించినందుకు పి హెచ్ డి ప్రదానం చేసినట్లు వెల్లడించారు.
డాక్టరేట్ అందుకున్న పూజిత










