పూజ స్కూల్ కరస్పాండెంట్, డాడీ హోమ్ నిర్వాహకులురాజారెడ్డి అనుమానాస్పద మృతి
మైలవరం డాడీ హోమ్ అంత్యక్రియలు
పాఠశాలను పరిశీలించిన డిఎస్‌పి నాగరాజు
ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్) : ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని పూజ స్కూల్ కరస్పాండెంట్, మై డాడీ హోమ్ నిర్వాహకులు రాజారెడ్డి అనుమానస్పద స్థితిలో మతి చెందారు. పాఠశాల ఆవరణంలో విగతజీవిగా పడి ఉన్న ఆయన్ను పాఠశాల సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మతి చెంది నట్లు వైద్యులు నిర్ధారించారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకొని అక్కడి పరిస్థితిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలి ంచారు. అనంతరం అనుమానస్పదం కింద కేసు నమోదు చేశారు. జమ్మలమడుగు డిఎస్‌పి నాగరాజు పూజ ఇంటర్నేషనల్ స్కూల్ పరిశీలించి అక్కడి సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. ఆయన మర ణం వెనుక ఎవరు ఉంటారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజాగా రాజారెడ్డి మతిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో రీపో స్టుమార్టం నిర్వహించేందుకు ఫోరెన్సిక్ అధికారుల రాకతో మత దేహాన్ని పూజ స్కూల్ నుంచి తిరిగి ఆసుపత్రికి తరలించారు. డాడీ హోమ్‌గా పిలుస్తున్న ఈ ప్రాంతంలో 150 మంది పేదలున్నారు. అనాథలు, వీధి పిల్లలు, హెచ్‌ఐవి సోకిన పిల్లలు, పెద్దలు, అత్యాచార బాధితులు, మానసిక వికలాంగులు, వద్ధులు ఇందులో ఉన్నారు. డాడీ హోమ్ చాలా మందికి ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ఆసరాగా ఉంటోంది. వారికి అండగా రాజా రెడ్డి ఉన్నారని భావించే వారు. ఆయన మృతితో అందులో ఉంటున్న వారిలో తీవ్ర విషాదం నెలకొంది. రాజారెడ్డి మతి పట్ల ఆయన కుటుం బసభ్యులతో పాఠశాల నిర్వాహకులు లక్ష్మి ప్రసూన, రమణారెడ్డి, సుబ్బారెడి విషాదంతో నివాళి అర్పించారు. రాజారెడ్డి అనాథ పిల్లలను చేరదీసి వారికి చదువు, క్రీడల్లో ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఆయన మృతి చెందడంతో విషాదం నెలకొంది.










