Dec 06,2020 11:22

           కావాల్సిన పదార్థాలు : మైదా/గోధుమ- నాలుగు కప్పులు, చక్కెర- చిన్న చెంచా, పచ్చి మిరపకాయలు- నాలుగు, పుదీనా ఆకులు- రెండు కప్పులు, నెయ్యి- పెద్ద చెంచా, ఉప్పు- తగినంత, నువ్వుల నూనె- వంద మిల్లీ గ్రాములు.
                                                   

                                                      తయారుచేసే విధానం :
పచ్చిమిరపకాయలను మెత్తగా రుబ్బుకోవాలి.
పుదీనా ఆకులని కత్తిరించి పెట్టుకోవాలి.
మైదా/గోధుమపిండిలో ఉప్పు, చక్కెర, పుదీనా ఆకులు, నూరిన పచ్చిమిరపకాయలు, నెయ్యి, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి, చపాతీపిండిలా కలుపుకోవాలి.
అందులోనే మరలా మూడు చెంచాల నూనె వేసి, పిండిని కలిపి ఆరుగంటల సేపు నాననివ్వాలి.
పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.
ఉండల్ని చిన్న చపాతీల్లా సన్నగా వత్తుకొని, దానిని మడతలు పెట్టి, ఒత్తుకున్న పరోటాలను పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నూనెపోసి కాగాక పరోటాలు వేయాలి.
రెండు వైపులా బంగారు వర్ణం వచ్చే వరకూ వాటిని కాల్చుకోవాలి. అంతే పరోటాలు రెడీ.