Apr 03,2023 21:17

లబ్ధిదారులకు బుక్‌ లెట్‌ ను అందిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌

పథకాలు చేరవేయడమే లక్ష్యం



ప్రజాశక్తి-డోన్‌

ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందజేయడమే వైసీపీ లక్షమని డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ అన్నారు. సోమవారం డోన్‌ పట్టణంలోని 5వ సచివాలయ పరిధిలో 8వ వార్డు నందు మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసిపి ప్రభుత్వంలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు బుక్‌ లెట్‌ అందజేయడం జరిగిం దన్నారు. వార్డులో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌ఎండి జాకీర్‌ హుస్సేన్‌,కౌన్సిలర్లు డి.మౌలాబీ,ఆర్ట్‌ రమణ, నాగేంద్ర, వెంకట రాముడు, కో ఆప్షన్‌ మెంబర్‌ రఫీ,పార్టీ నాయకులు కృష్ణారెడ్డి,అశోక్‌,శ్రీధర్‌ నాయుడు, డంకేష్‌, భాస్కర్‌,సుధాకర్‌, మెప్మా సిబ్బంది,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.