Jul 07,2022 21:53

సచివాలయ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు
ప్రజాశక్తి-కొత్తవలస : ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్రతి కుటుంబానికీ లబ్ధిచేకూరుతోందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ఉత్తరాపల్లిలో ఉపాధి హామీ నిధులు రూ.35 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ సింగంపల్లి వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నేడు మన రాష్ట్రంలోని గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పేదల ముంగిటకే సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పేదల పిల్లలు ఉన్నతమైన చదువులు చదివించడానికి అమ్మఒడి పథకం దోహదపడుతుందని చెప్పారు. గ్రామంలో రూ.35 లక్షలతో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వై.పద్మజ, పిఆర్‌ డిఇ సిహెచ్‌వి నాయుడు, ఇఒపిఆర్‌డి కె.ధర్మారావు, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, కొత్తవలస పిఎసిఎస్‌ చైర్మన్‌ గొరపల్లి శివ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బొంతల వెంకటరావు, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, ఎంపిటిసి శివప్రసాద్‌, చిన్నిపాలెం సర్పంచ్‌ రంగుడు పద్మలత, చినరావుపల్లి సర్పంచ్‌ బూసాల దేవుడు, నాయకులు శింగంపల్లి గణేష్‌, రంగుడు పవన్‌, పల్లా భీష్మ, పిఎస్‌ఎన్‌ పాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.