
ప్రజాశక్తి-మాడుగుల:సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు ఆసరా లభించిందని ఉప ముఖ్యమంత్రి బూ డి ముత్యాల నాయుడు అన్నారు. శుక్రవారం ఒమ్మలిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలకు సామాన్య ప్రజల బతులకు బాటలు చూపుతున్నాయని అన్నారు. ఒక్క ఒమ్మలి పంచాయతీలో 15.5 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. 101 మంది లబ్ధిదారులకు 1.81 కోట్లతో జగనన్న గృహాలు నిర్మాణం అవుతున్నాయని, 2 కోట్లతో ఇంటింటికీ మంచినీరు సరఫరా అమలు అవుతుందని తెలిపారు. సీసి రహదారులకు, కాలువలకు 20 లక్షలు మంజూరు చేశారు. సుమారు 65 లక్షలతో చేపడుతుతున్న నాడు నేడు పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి, సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నేతలతో కలసి గ్రామంలోని జగ్జీజీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెదబాబు, వైస్ ఎంపిపి లు రాజారామ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.