Dec 03,2022 23:31

మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాబూరావు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:పార్టీలు చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలను కల్పిస్తూ పథకాలతో ఆర్థికంగా సిఎం జగన్‌ చేయూత అందిస్తున్నారని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు. శనివారం నర్సీపట్నం మండలం మొండికండి, కసిరెడ్డిపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మ్మెల్యే వీల్చైర్లోనే గ్రామంలో పర్యటిస్తూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి వైయన్‌. జగన్మోహన్‌ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. పథకాలు అమలు పారదర్శకంగా జరుగుతుందని, అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం జగన్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సుర్ల రాజేశ్వరి, సర్పంచుల సంఘం అధ్యక్షులు కన్నయ్యనాయుడు, ఎంపిడిఒ జయమాధవి, సిడిపిఒ మేరీ సువార్త, హౌసింగ్‌ ఏఈ నాయుడు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బిసి గర్జనను జయప్రదం చేయాలి
ప్రజాశక్తి -యస్‌.రాయవరం:ఈ నెల 7 వ తేదీన జరిగే బిసి గర్జనను జయప్రదం చేయాలని, నియోజకవర్గం నుండి బిసి సోదరులు తరలి వెళ్ళనున్నట్లు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు తెలిపారు. శనివారం మండలంలోని వమ్మవరం గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ, పాయకరావుపేట నియోజకవర్గం నుండి 500 మందితో విజయవాడలో ఈ నెల 7వ తేదీన నిర్వహిస్తున్న జయహౌ బి.సి.మహాగర్జనకు వెళ్లను న్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.
యస్‌.రాయవరం:నవరత్నాలతో రాష్ట్రంలో నవశకం ప్రారంభమైందని ఎమ్మెల్యే గొల్లబాబూరావు అన్నారు. వమ్మవరం గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలకు అందుతున్న సంక్షేమ పధకాలపై ఆరా తీశారు. నవరత్నాల కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేపట్టారు.