
ప్రజాశక్తి - గరుగుబిల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కురుపాం ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. మంగళవారం స్థానిక పిఎసిఎస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం గ్రామ సచివాలయాల కన్వీనర్లు, గృహసారధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వాలంటీర్లు, వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వం తరఫున అందిస్తున్న లబ్ధి గురించి చెప్పామని ప్రజా సమస్యలను సైతం పరిష్కరించినట్టు తెలిపారు. వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని నాయకులు, కార్యకర్తలకు తెలియజేశారు. అదేవిధంగా గెలుపే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి ఉరిటి రామారావు, జెడ్పీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, సర్పంచులు కలిశెట్టి ఇందుమతి, గులిపల్లి నారాయణమ్మ, బొంతాడ మహేశ్వరరావు, ఎంపిటిసి సభ్యులు బొంగు గౌరమ్మ, వైసిపి నాయకులు రౌతు రామి నాయుడు, గొట్టాపు తేజేశ్వరరావు, బత్తల పకీరు నాయుడు, కేతిరెడ్డి అచ్యుతరావు, అక్కేన వెంకట నాయుడు, మూడడ్ల అప్పారావు, గులిపల్లి శ్రీనివాసనాయుడు, తదితరులు పాల్గొన్నారు.