Oct 27,2022 23:19

పథకాల బుక్‌లెట్‌లను ఇస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి-పాడేరురూరల్‌: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పేద గిరిజనులకు సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టుగుళ్లి భాగ్యలక్ష్మి సూచించారు. మండలంలోని గబ్బంగి పంచాయతీలోని కొత్తాబు, కురిడిమెట్ట, చీడిమెట్ట, దేవరపల్లి, తదితర గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు జేస్తున్న అన్ని కార్యక్రమాలతో పాటు, నవరత్నాల పథకాల ద్వారా లబ్దిపొందిన గిరిజనులను ఎమ్మెల్యే ఇంటింటా కలిసి, వారితో మమేకం అయ్యారు. లబ్దిపొందిన పధకాలకు సంబందించి కరపత్రాలను పంపిణీ చేసారు. గిరిజనుల వ్యక్తిగత, గ్రామాల సమస్యలపై ఆరా తీసారు. తాగునీటి పథకాలకు సంబందించిన సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిఎం జగన్‌ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.నాడు - నేడు ద్వారా పాఠశాలలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తూ మాలిక సదుపాయాలు కల్పిస్తున్నారని తెలిపారు. పాడేరులో రూ.500కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతుందని, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నీలకంఠం, రాంబాబు, సన్నీబాబు, ఎంపిటిసిలు సన్యాసిరావు, రామకష్ణ పాత్రుడు, నరసింహమూర్తి, చిట్టమ్మ, తదితరులు పాల్గొన్నారు.