గృహ నిర్మాణాలను పరిశీలిస్తున్న జేసీ
ప్రజాశక్తి- అద్దంకి : ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మండల పరిధిలోని శింగరకొండ పాలెం జగనన్న కాలనీ లేఅవుట్ లోని గృహ నిర్మాణాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ లబ్ధిదారులు వీలైనంత త్వరగా జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలన్నారు. గృహ నిర్మాణాలపై అధికారులు లబ్ధి దారులకు అవగాహన కల్పించి త్వరగా పూర్తి చేసుకొనేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు సుబ్బారెడ్డి, గ్రామ సర్పంచి, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










