Apr 06,2023 00:58

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న నేతలు

ప్రజాశక్తి-గొలుగొండ:ప్రభుత్వ సంక్షేమ పథకాలను గృహసారధులు వివరించాలని జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, వైసిపి మండలాధ్యక్షులు లెక్కల సత్యనారాయణ కోరారు. మండలంలోని పుత్తడిగైరంపేట, పాతమల్లంపేట గ్రామాల్లో గృహసారధులు, వలంటీర్లతో బుధవారం సమావేశమయ్యారు. ఈ నెల 7 నుంచి ప్రతీ ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. అనంతరం వారి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ల సంఘం అధ్యక్షులు కొరుప్రోలు పాణి శాంతారామ్‌, గృహసారధులు పాల్గొన్నారు.