ప్రజాశక్తి - భోగాపురం : ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అనే దానిపై ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులతో ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష, గడపగడపకు మన ప్రభుత్వం, ఎందుకు ఆంధ్రాకి జగన్ కావాలి ఈ మూడు కార్యక్రమాలను ఏకకాలంలో పూర్తిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. మన ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఇది ఒక చక్కటి అవకాశం అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, వైస్ ఎంపిపి రావాడ బాబు, ఎంపిడిఒ అప్పలనాయుడు, సచివాలయ కన్వీనర్లు పడాల శ్రీనివాసరావు, సుందర హరీష్, భాను, సుబోసన రావు తదితరులు పాల్గొన్నారు.
సొసైటీ డైరెక్టర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే
మత్స్యకార సొసైటీ డైరెక్టర్ మైలపల్లి నరసింహులను ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సోమవారం పరామర్శించారు. ఇటీవలి ఆయన తల్లి అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ముక్కాం గ్రామం వెళ్లి ఆయనను పరామర్శించారు. వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డితో పాటు పలువురు నాయకులు పరామర్శించారు.










