Aug 31,2023 21:49

భామినిలో గిరిజన విద్యార్థినిలతో ముచ్చటిస్తున్న ట్రైనీ ఐఎఎస్‌లు

భామిని: ట్రైనీ ఐఎఎస్‌లు నాలుగో రోజు మండలంలోని బొడ్డగూడ పంచాయతీ పరిసర గ్రామాల్లోని గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై గిరిజనులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ముఖ్య పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనం, ఆ పథకాల వల్ల ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారు వంటి విషయాలపై గ్రామంలోని పెద్దలు, యువకులతో మాట్లాడారు. అలాగే గిరిజనుల కోసం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాల వల్ల కలిగే లబ్ది, ఆయా పథకాలు మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు ఎంతమేర చేరవవుతున్నాయి వంటి అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. పాఠశాలలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. గ్రామంలో జరుగుతున్న సంతను పరిశీలించారు. గృహ నిర్మాణ లబ్దిదారులతో మాట్లాడారు.అనంతరం గ్రామమంతా సందర్శించారు.
పూతికవలసలో...
సీతంపేట : మండలంఓలని పూతికవలసలో ట్రైనీ ఐఎఎస్‌ అధికారులు పర్యటించారు. ఈ సంధర్బంగా ప్రభుత్వం కల్పిస్తున్న పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనం, ప్రజలు ఎంతమేర సంతృప్తిగా ఉన్నారు వంటి విషయాలపై గ్రామంలోని పెద్దలు, యువకులతో మాట్లాడారు. అలాగే గిరిజనుల కోసం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాల వల్ల కలిగే లబ్ది, ఆయా పథకాలు మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు ఎంతమేర చేరువవుతున్నాయి వంటి అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. కార్యక్రమంలో వెలుగు ఎపిడి రమణ, లైజనింగ్‌ అధికారులు మంగవేణి, కోటిబాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.