ప్రజాశక్తి - కాకినాడ రూరల్
సంక్షేమ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారులకు అందించడంలో వాలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని వైసిపి కాకినాడ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఎంఎల్‌ఎల కురసాల కన్నబాబు అన్నారు. రమణయ్యపేట పంచాయతీ సర్పవరం స్పందన హాల్లో డిఎల్‌డిఒ నారాయణ మూర్తి అధ్యక్షతన ఎంఎల్‌ఎ కన్నబాబు వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని నేమాం, పండూరు, పి.వెంకటాపురం, పెనుమర్తి, రమణయ్యపేట, సర్పవరం, సూర్యారావుపేట, తమ్మవరం, తిమ్మాపురం, వాకలపూడి, వలసపాకల గ్రామాలలో సేవా వజ్రకు ఇద్దరు, సేవా రత్నకు ఇద్దరు, సేవా మిత్రకు 917 మంది కలిపి మొత్తం 928మంది వాలంటీర్లు ఎంపికయ్యారన్నారు. ఈసం దర్భంగా మండలంలోని ఉత్తమ వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వలవల వెంకటేశ్వరరావు, ఎంపి టిసిలు సారా రాజేష్, నందిపాటి శ్రీనివాస్, ముద్దన ఎంపిడిఒ శ్రీనివాస్, గోపుశెట్టి బాల్జీ, ఎఎంసి చైర్మన్ గీసాల శ్రీను, వైఎస్ ఎంపిపిలు బందిలి విరీష, గుత్తల సత్తిబాబు, తిమ్మాపురం, నేమాం, తమ్మవరం, సర్పవరం సర్పంచ్లు బెజవాడ సత్య నారాయణ, రామదేవు సూర్యప్రకాశరావు, గొల్లపల్లి రాంబాబు, శీలం నాగేశ్వరరావు, పండూరు ఉప సర్పంచ్ వెంకట్రాజు పాల్గొన్నారు. ఏలేశ్వరం ఎన్ కన్వెన్షన్ హాల్లో మంగళ వారం ఆయన ఏలేశ్వరం నగర పంచాయతీ, మండల పరిధిలోని గ్రామాల్లో సేవలందిస్తున్న వాలంటీర్లను ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ప్రజాప్రతినిధులు సత్కరించారు. అనంతరం వైసిపి ప్రభుత్వ పాలనకు నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైస్ ఎంపిపిచిక్కాల రాజేశ్వరి, ఆలమండ చలమయ్య, శిడగం వెంకటేశ్వరరావు, నీరుకొండ సత్య నారాయణ, బదిరెడ్డి గోవింద్, బొదిరెడ్డి గోపాలకృష్ణ, తొండరపు రాంబాబు, సుంకర రాంబాబు, చిక్కాల లక్ష్మణరావు, అడప పార్థసారథి, బేరి అరవింద్ కుమార్, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
సత్కరించిన వాలంటీర్లతో ఎంఎల్‌ఎ, ప్రజాప్రతినిధులు










