Feb 13,2023 23:02

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: దుర్గగుడి దేవస్థానం ఆధ్వర్యంలో భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి వార్లకు సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. మహాశివరాత్రి ఉత్సవాలు-2023 సందర్భంగా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్లకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి తరుపున సోమవారం ఆలయ పాలకమండలి చైర్మన్‌ కర్నాటి రాంబాబు దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు శ్రీశైలం దేవస్థానం చేరుకోగా శ్రీశైల దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికారు. అనంతరం వీరు శ్రీ భ్రమరంభ మల్లిఖార్జునల స్వామివార్లను దర్శనం చేసుకొని పట్టు వస్త్రాలు స్వామివారికి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కేసరి నాగమణి, కట్టా సత్తయ్య, దేవిశెట్టి బాలకష్ణ, బచ్చు మాధవికష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమానూరి కల్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, అల్లూరి కష్ణవేణి, తోట్టడి వేదకుమారి, ఆలయ వైదిక కమిటీ సభ్యులు ఆర్‌.శ్రీనివాసశాస్త్రి, కార్యనిర్వాహక ఇంజినీర్‌ ఎల్‌. రమాదేవి, వేదపండితులు, అర్చకులు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.