ప్రజాశక్తి - బుట్టాయగూడెం
పట్టుదలతో శ్రమిస్తే విజయం వరిస్తుందని, పోలీసు ఉద్యోగం పొందాలని కసితో కృషి చేస్తే తప్పనిసరిగా పొందొచ్చని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న గిరిజన యువతకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో 'గిరి నేస్తం' కార్యక్రమం ద్వారా రెండు నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక ఐటిడిఎ కార్యాలయం వద్ద గల యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో శనివారం కలెక్టర్ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కోరుకున్నది ఏదీ కష్టపడకుండా దొర కదన్నారు. ఒక కుటుంబంలోని పేదరికం పోవాలంటే కనీసం ఒకరు కష్టపడి ఉద్యోగం సాధించాలన్నారు. ఇష్టంగా మనస్సు పెట్టి శిక్షణ పొందితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుం దన్నారు. నిర్మాణ రంగం, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ వంటి రంగంలో మానవనరులకు మంచి డిమాండ్ ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు తాడువాయిలో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నామని, తమ సొంత ప్రాంతం నుండి ఉపాధి కోల్పోయి పునరావాస కాలనీలకు చేరుకునే గిరిజన యువతకు వారికి అభిరుచి కలిగిన రంగంలో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందించే ందుకు ఆ ప్రాంతంలో స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను నెలకొల్పుతామన్నారు. ఉద్యోగం వచ్చిన వారు ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎస్‌పి రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, పౌరహక్కులకు భంగం కలగకుండా పోలీసు శాఖ ప్రజలతో మమేకమవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్, భద్రత దళాల విభాగాల్లో 23 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. వీటిలో రాష్ట్రంలో 6100 పోలీసు ఉద్యో గాలకు నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. వీటిలో గిరిజన యువత ఉద్యోగాలు సాధిం చేందుకు 'గిరి నేస్తం' ద్వారా 88 మంది గిరిజన యువతకు శిక్షణా కార్యక్రమం నిర్వ హిస్తున్నామన్నారు. అనంతరం పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు మాట్లాడారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్, ఐటిడిఎ ఇన్‌ఛార్జి పిఒ పి.అరుణ్‌బాబు, జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ కె.జాన్సీరాణి, పోలవరం డిఎస్‌పి లతాకుమారి, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, పోలీసు శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










