ప్రజాశక్తి - రేపల్లె
రెవెన్యూ డివిజన్ కేంద్రంగా రూపుదిద్దుకున్న రేపల్లె పట్టణంలో దశాబ్దాలుగా వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు బహిరంగ సభలు నిర్వహింస్తున్న నెహ్రూ విగ్రహం వద్ద పురవేదిక నిర్మించాలని జైభీం భారత పార్టీ నియోజకవర్గ కన్వీనర్, న్యాయవాది దోవా రమేష్ రాంజీ మునిసిపల్ కమీషనర్ బందెల విజయ సారధికి వినతిపత్రం అందజేశారు. కవులు, కళాకారులు, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, సాంఘిక నాటకములు అనాదిగా నిర్వహిస్తున్న ఓపెన్ థియేటర్ నందు నూతన కళా వేదికను నిర్మించాలని కోరారు. ఆంధ్ర రత్న మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాల నందు క్రొత్త సభా వేదికను నిర్మించాలని కోరారు. వీటిద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని సూచించారు. కౌన్సిల్‌లో ఈ అంశాలను ప్రతిపాదించాలని కోరారు. కార్యక్రమంలో జైభీం పార్టీ మండల కన్వీనర్ కర్రా బాబురావు, పోతార్లంక శివ వెంకటేశ్వరావు, నెరుసు వెంకటరావు నాయుడు, మండే యాకోబు పాల్గొన్నారు.










