Feb 27,2023 19:46

కాలువలో ఉన్న చెత్తను పరిశీలిస్తున్న డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి
మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌
ప్రజాశక్తి-డోన్‌

డోన్‌ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ తెలిపారు. సోమవారం డోన్‌ పట్టణం లోని ఫ్లై ఓవర్‌ కింద ఏర్పాటు చేసుకున్న షాపులను ఆయన పరిశీలించారు. అలాగే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయరాదని ప్రజలకు సూచించారు. ఫ్లై ఓవర్‌ కింద ఏర్పాటు చేసుకున్న దుకాణ యజమానులు వారికి కేటాయించిన స్థలాల్లో మాత్రమే ఏర్పాటు చేసుకొని ముందుకు రాకుండా ఉండాలన్నారు. పార్కింగ్‌ స్థలంలో మాత్రమే ప్రజలు పార్కింగ్‌ చేసుకోవాలని సూచించారు. దుకాణ దారులు ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయరాదని మున్సిపాలిటీకి సంబంధించిన వాటిలో చెత్త వేయాలని సూచించారు.