ప్రజాశక్తి - ఆదోని
ఆదోని పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నామని, ప్రజలు సహకరించాలని మున్సిపల్ ఛైర్మన్ శాంత, వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ జయమనోజ్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని 36వ వార్డులో కౌన్సిలర్ సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ బోయ శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ ఇంజినీర్ నాగభూషణం రెడ్డి హాజరయ్యారు. ప్రతి గడపకూ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. 2024లో మళ్లీ వైసిపి ప్రభుత్వాన్ని ప్రజల ఆశీర్వదిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తామని చెప్పారు. వైసిపి పట్టణ అధ్యక్షులు బి.దేవా, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరసింహులు, కౌన్సిలర్ ఫయాజ్, నాయకులు అబ్దుల్ సునర్, ఖాదర్, అమాన్, నల్లారెడ్డి, గోవిందు, అశోక్, నాగరాజ్, ఏసోబు, ఫర్హాద్, భాను, బిటి.లక్ష్మన్న, దుర్గప్ప, బాలాజీ, మధు, భాస్కర్, మునీర్, ఎఇ సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, సన్నీ, రాజేశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి ఉన్నారు.
సమస్యలు తెలుసుకుంటున్న మున్సిపల్ ఛైర్మన్ శాంత










