Jun 28,2023 20:26

భూమి పూజ నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణాభివృద్ధే వైసిపి ప్రభుత్వ లక్ష్యమని వైసిపి సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయడం ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి లక్ష్యమని తెలిపారు. బుధవారం పట్టణంలో రూ.కోటి వ్యయంతో 16వ వార్డులో కల్వర్ట్‌, 14వ వార్డులో పైపులైన్‌, 5వ, 6వ వార్డుల్లో పైపులైన్‌, 6వ వార్డులో 'గడపగడపకు మన ప్రభుత్వం' కింద మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందులో భాగంగానే 16వ వార్డు కురువ ఫంక్షన్‌ హాలు ఎదురుగా కొన్నేళ్ల నుంచి ప్రజల ఇబ్బంది దృష్ట్యా, సమస్య పరిష్కారం కోసం కల్వర్టు, సిసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.