ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
మండలంలోని పట్టింపాలెం గ్రామంలో ట్రాక్టర్ పందేలు సోమవారం నిర్వహించారు. పట్టింపాలెం, నీలాద్రిపురం, కొమ్ముగూడెం గ్రామాల మధ్య ట్రాక్టర్ పందేలు నిర్వహించారు. రెండు ట్రాక్టర్లకు మధ్యలో మోగు బిగించి ఏ ట్రాక్టర్ అయితే బలంగా అవతలి ట్రాక్టర్ లాగుతుందో ఆ ట్రాక్టర్ పందెంలో గెలిచినట్లు ప్రకటిస్తామని పందేల నిర్వాహకులు తెలిపారు. యువత కోడిపందేలు, జూదం, గుండాట జోలికి పోకుండా ఉండేలా ఈ పందేలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.










