ప్రజాశక్తి - సంతమాగులూరు
సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిపాలనలో కుల, మతాలు, పార్టీలకు అతీతంగా అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు శాప్ నెట్ చైర్మన్, వైసీపీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య తెలిపారు. మండలంలోని పత్తేపురం గ్రామంలో మొదటిరోజు గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఆయా కుటుంబాలకు చేకూరిన లబ్దిని వివరించారు. సచివాలయం ద్వారా అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. సర్పంచి గుమ్మా హరికృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పిటిసి అడవి శ్రీనివాసరావు, వైసీపీ మండల కన్వీనర్ చింతా రామారావు, బండి కోటిరెడ్డి, వెంకట్రావు, అట్లా పెద్దవెంకటరెడ్డి, కొల్లి వెంకటరావు, ఇప్పల ముసలారెడ్డి, ఓరుగంటి కోటిరెడ్డి పాల్గొన్నారు.










