Oct 18,2022 23:23

మాట్లాడుతున్న పిడిఎఫ్‌ అభ్యర్థి రమాప్రభ

పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి రమాప్రభ పిలుపు
ప్రజాశక్తి -గాజువాక
: గాజువాక నియోజకవర్గంలోని అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్ధేశిత గడువులోగా తమ ఓటును నమోదు చేసుకోవాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరడ్ల రమాప్రభ కోరారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని షీలానగర, అక్కిరెడ్డిపాలెం, ఆటోనగర్‌, తోకాడ సమైక్య అపార్ట్‌మెంట్‌, ఎల్‌ఐసి, జోగవానిపాలెం, యశోద స్కూలు, మింది హైస్కూలులో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. పట్టభద్రులంతా తమ ఓటును నమోదు చేసుకుని త్వరలో జరగనున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి పిడిఎఫ్‌ తరపున పోటీ చేస్తున్న తనకు విచక్షణతో ఓటేసి గెలిపించాలని కోరార. సమావేశంలో మహిళా సంఘం నాయకురాలు వై సత్యవతి, కె.సంతోషం, బెహరా త్రినాథస్వామి, పాలూరు లక్ష్మణ స్వామి, డి.అప్పారావు, కోటేశ్వరరావు, కిరీటం, శ్రీనివాస్‌ చౌదరి, తౌడన్న పాల్గొన్నారు.