పిడిఎఫ్ అభ్యర్థి రమాప్రభ
ప్రజాశక్తి -గాజువాక : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులంతా తమ ఓటును నమోదు చేసుకోవాలని పిడిఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కె.రమాప్రభ కోరారు. శుక్రవారం గాజువాకలోని భాష్యం స్కూలు, చైతన్య కళాశాలలతోపాటు తోకాడ, గాజువాకలోని పలు ప్రాంతాల్లో సందర్శించి, అర్హులైన పట్టభద్రులను కలిసి ముందుగా తమ ఓటు హక్కును ఈనెల 7లోగా నమోదు చేసుకోవాలని కోరారు. పిడిఎఫ్ అభ్యర్థిగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేస్తున్న తనకు ప్రధమ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. రమాప్రభతోపాటు ఐద్వా జిల్లా కార్యదర్శి వై సత్యవతి, నాయకులు సంతోషం, వార్వ నివాస నాయకులు కిరీటం, త్రినాథ స్వామి, భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ భారతి, సిఐటియు నాయకులు ఎం.రాంబాబు, కె శ్రీనివాసు పాల్గొన్నారు..










