ప్రజాశక్తి-అనకాపల్లి
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు నమోదులో చోటుచేసుకున్న అవకతవకలపై జుడిషియల్ ఎంక్వయిరీ వేయాలని కోరుతూ టిడిపి నాయకులు మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాలో 15 వేలు అనర్హుల ఓట్లు నమోదు చేసినట్లు ఎన్నికల కమిషన్ గుర్తించిందని తెలిపారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ అవకతవకలు జరిగాయన్నారు. దరఖాస్తులను రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించి అనర్హత కలిగిన దరఖాస్తులను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై డిఆర్‌ఓ స్పందిస్తూ ఎన్నికల కమిషన్ నుంచి ఇంతవరకు జరిగిన అవకతవకలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, తక్షణమే వాటిని సవరణ చేసి అసలైన ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి గాడు చిన్ని కుమారి లక్ష్మి, టిడిపి చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు బత్తుల తాతయ్యబాబు, పివిజి.కుమార్, ఆ పార్టీ నాయకులు రాజాన రమేష్, బిపిఎస్.నాయుడు, సూరే సతీష్, అక్కిరెడ్డి రమణ బాబు పాల్గొన్నారు.










