రైలు ఇంజిన్‌కు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
ప్రజాశక్తి-విజయనగరం కోట : శృంగవరపుకోట మండలం బొడ్డవర రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శనివారం విశాఖపట్నం నుంచి కిరం డోలు వెళ్తున్న గూడ్సు బొడ్డవర రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఇంజిన్ పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మరమత్తులు చేపట్టి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు.










