Nov 14,2023 00:55

నిరసన చేపడుతున్న బాధిత లబ్ధిదారులు

ప్రజాశక్తి -కొత్తకోట:కొత్తకోట కోళ్ల ఫారం ఎస్సీ లబ్ధిదారులకు తక్షణమే పట్టాల మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా దళిత బహుజన శ్రామిక సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేటి రాజు మాట్లాడుతూ, గత 35 కింద దళితులకు సుమారు 20 మందికి జీవన ఆధారం కోసం కోళ్లు పెంపకం షెడ్డులు నిర్మాణం చేసారని తెలిపారు. నష్టాల కారణంగా కోళ్లు పెంపకం నిలిచి పోయిందని రాజు వివరించారు. తమకు కేటాయించిన స్థలానికి నేటికీ హక్కు కల్పించ లేదన్నారు. పలు మార్లు అధికారుల దృష్టి కి తెలిపినా పరిష్కరించలేదని ఆరోపించారు. రెండేళ్ల కింద చోడవరం ఎమ్మెల్యే కు వినతిపత్రం ఇవ్వగా రెవెన్యూ అధికారులకు సిపార్స్‌ లెటర్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ఇంత వరకూ రెవెన్యూ అధికారులు స్పందించ లేదని చెప్పారు.అంతకు ముందు వైఎస్‌ ఆర్‌ విగ్రహనికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కోళ్ల ఫారం లబ్ధిదారులు చెక్క రాజారావు, నాగు, మల్లేటి రాజా, గెడ్డం శ్రీను, బుంగా లోవరాజు, పూడి సత్తిబాబు పాల్గొన్నారు.
¸