Nov 09,2022 21:44

ప్రజాశక్తి - టి.నరసాపురం
          మండలంలోని కృష్ణాపురం మెట్టభూముల్లో సాగు చేస్తున్న గిరిజనులకు, పేదలకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రాన్ని తహశీల్దార్‌ జెవి.సుబ్బారావుకు అందజేశారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అనుమోలు మురళీ మాట్లాడుతూ మండలంలోని అల్లూరి సీతారామరాజునగర్‌కు చెందిన పేదలు సర్వే నెంబరు 86లో 2010 నుండి పత్తి, జీడిమామిడి వంటి పంటలు సాగు చేస్తున్నారని, వారికి రెవెన్యూ అధికారులు సాగుపత్రాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మడకం కుమారి, వగ్గాల లక్ష్మి, తాటి భూషమ్మ, బరగడ కుమారి, గంగ పాల్గొన్నారు.