ప్రజాశక్తి - వీరవాసరం
పత్రికా స్వేచ్ఛకు ముప్పు రాకుండా ప్రజలే దానిని కాపాడుకోవాలని సీనియర్ జర్నలిస్టు గుండా రామకృష్ణ అన్నారు. జాతీయ ప్రతికా దినోత్సవాన్ని వీరవాసరం వనితా క్లబ్ ప్రెసెడెంట్ డాక్టర్ బి.లక్ష్మీకళాయణి అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వాలు నిర్భంధంతో అణిచివేస్తున్నాయన్నారు. అనంతరం వనిత క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టు గుండా రామకృష్ణ, మల్లుల జైకృష్ణ, కుంచే శ్రీరంగ నాయకులు, నారగన సుధాకర్, ఆర్.లాల్‌రావు, చామకూరి నరసింహరావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుంచే వేణు, గొర్రె రాధా సులోచన, కామిశెట్టి విజయలక్ష్మి, సుబ్బారావు, కరింశెట్టి మూర్తి, బృందావనం నాగేంద్ర, ఉయ్యూరు మరళీకృష్ణ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : సమాజానికి పాత్రికేయులు చేస్తున్న సేవలు కీలకమని, వారిని గౌరవించాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉందని లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ లయన్ గట్టిం మాణిక్యాలరావు అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొండయ్యచెరువు సమీపంలోని కైండ్‌నెస్ సొసైటీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెం సిటీ కేబుల్ టిసిసి వీడియో జర్నలిస్టులు శీలి రాజు, కాసాని వెంకటరత్నం, మణికంఠలను లయన్స్ క్లబ్ తరపున గవర్నర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ, లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మన్ పేరిచర్ల మురళీకృష్ణంరాజు, లయన్స్ జిల్లా కేబినెట్ సెక్రటరీ నూకల నాగమల్లేశ్వరరావు, లయన్స్ క్లబ్ డైమండ్ సభ్యులు ఎస్.హేమసుందర్, కె.వెంకటేశ్వరరావు, యర్రా ఆంజనేయస్వామి, సాయిరాం పాల్గొన్నారు.