Jul 02,2023 02:00
ప్రజాశక్తి వైద్యుల దినోత్సవ సంచికను ఆవిష్కరిస్తున్న ఐఎంఏ వైద్యులు

ప్రజాశక్తి-చీరాల: పత్రిక రంగంలో ప్రజాశక్తి దినపత్రిక ప్రత్యేకమని, ప్రజల సమస్యలపై వాస్తవాలను వెలికితీస్తూ ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూన్న ప్రజాశక్తి దినపత్రిక పనితీరు అభినందనీయమని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వైద్యులు అన్నారు. శనివారం వైద్యుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఐఎంఏ హాలులో వైద్యుల దినోత్సవ వేడుకలు ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ శ్రీదేవి డాక్టర్‌ పి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా మాజీ ముఖ్యమంత్రి సీనియర్‌ వైద్యులు బీసీ రారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఐఎంఏ వైద్యులు నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కటింగ్‌ నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఐఎంఏ వైద్యులందరూ ఐక్యంగా ఉంటూ వైద్యుల సమస్యల పరిష్కారానికి jఔషి చేయాలని అన్నారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా మండలంలోని తోటవారిపాలెం గ్రామాన్ని ఐఎంఏ దత్తత తీసుకొని ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా గ్రామానికి అండగా ఉంటున్నట్లు ఐఎంఏ వైద్యులు తెలిపారు.త్వరలోనే ఆ గ్రామానికి వచ్చి పూర్తి వివరాలు తెలియజేస్తామని తోటవారిపాలెం వైస్‌ ఎంపీపీ నాదెండ్ల కోటేశ్వరరావుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ శ్రీదేవి, డాక్టర్‌ పి శ్రీకాంత్‌, సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ ఉమామోహన్‌, డాక్టర్‌ రమేష్‌ డాక్టర్‌ రామjఔష్ణ హనుమాన్‌, డాక్టర్‌ నిరుపమ, డాక్టర్‌ పోలవరపు వెంకటప్రసాద్‌, డాక్టర్‌ వెంకట్రావు, డాక్టర్‌ హనుమంతరావు, డాక్టర్‌ కృష్ణ చైతన్య, డాక్టర్‌ ప్రీతి, డాక్టర్‌ నారాయణ రెడ్డి, డాక్టర్‌ విజయకుమార్‌, ప్రజాశక్తి చీరాల డివిజన్‌ ఇంచార్జ్‌ కె సురేష్‌, చీరాల విలేకరి బెజ్జం మణికుమార్‌, ఐఎంఏ వైద్యులు పాల్గొన్నారు.