Nov 19,2023 20:53

పతకం సాధించిన గోవింద్‌

వీరఘట్టం:మండలంలోని తలవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పి.గోవింద్‌కు రాష్ట్రస్థాయి పాఠశాలల పోటీల్లో కాంస్య పతకం లభించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పాడ అప్పారావు ఆదివారం తెలిపారు. ఈనెల 15, 17 తేదీల్లో ఎస్‌ నంద్యాల జిల్లాలోని పిజి హైస్కూల్‌ అండర్‌-17 విభాగంలో ఫెన్సింగ్‌ పోటీల్లో రాష్ట్రస్థాయిలో గెలుపొందడంతో ఈపతకం లభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి సిహెచ్‌ మధుసూదనరావు, వ్యాయమ ఉపాధ్యాయులు ఎం.రామకృష్ణ, వై.ధనలక్ష్మి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలిపారు.