క్రీడాకారులకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్
ప్రజాశక్తి-పాడేరు:ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో గెలుపొందిన అల్లూరి జిల్లా పరిధిలోని క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పత కాలను, సర్టిఫికెట్లను సోమవారం కలెక్టరేట్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జిఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సూరిబాబు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు










