ప్రజాశక్తి -తగరపువలస : హరియాణాలోని సోనిపట్‌లో గత నెల 28 నుంచి 31 వరకు బాక్సింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిడిఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఎపి బాక్సింగ్ అసోసియేషన్ తరఫున పాల్గొన్న భీమిలి మండలం, ఒకటో జోన్‌కు చెందిన ఆరుగురు బాక్సరుఉల పతకాలు సత్తా చాటారు. సీనియర్స్ (60-63 కిలోలు) విభాగంలో నమ్మివానిపాలేనికి చెందిన పి.పోలి రాజుబాబు బంగారు పతకం సాధించారు. జూనియర్ (52-54 కిలోలు) విభాగంలో అన్నవరం గ్రామానికి చెందిన సిహెచ్ సురేంద్ర, సీనియర్ విభాగంలో మజ్జివలసకు చెందిన ఎస్ పవన్‌కుమార్ కాంస్య పతకాలు సాధించారు. సబ్ జూనియర్స్ (30-32కిలోలు) విభాగంలో తగరపువలసకు చెందిన ఎల్.హేమకేష్, సీనియర్స్(57-60 కిలోలు) విభాగంలో అన్నవరం గ్రామానికి చెందిన వాసుపల్లి మురళి, జూనియర్స్ (48-50) విభాగంలో అదే గ్రామానికి చెందిన వాసుపలి ్లఅజరు రజత పతకాలు సాధించారు. బాక్సింగ్‌లో సత్తా చాటిన వీరిని పలువురు అభినందించారు.










