ప్రజాశక్తి - కాకినాడ
వికలాంగుల హక్కుల చట్టం-2016 పటిష్టంగా అమలు అయ్యేలా రెవెన్యూ, పోలీస్, వికలాంగులు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, ఐసిడిఎస్ తదితర సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టుహాల్‌లో కలెక్టర్ డిఆర్‌ఒ కె.శ్రీధర్‌రెడ్డితో కలిసి వికలాంగుల హక్కుల చట్టం-2016, చట్టం పటిష్ట అమలుకు రూపొందించిన నియమావళి అమలుపై సమన్వయ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్ మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం-2016లోని సెక్షన్ 72 మేరకు వికలాంగుల హక్కుల పరి రక్షణ, సంక్షేమానికి జిల్లా కలెక్టర్ ఛైర్‌పర్సన్‌గా జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో జిల్లా ఎస్‌పి, ఆసుపత్రి సేవల సమన్వయకర్త, డిఆర్‌డిఎ పీడీ, జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ కార్యదర్శి, ఎల్‌డిఎం, మెప్మా పీడీ, ఐసిడిఎస్ పీడీ తదితరులతో పాటు విక లాంగుల సామాజిక స్థితిగతులు, అభివృద్ధిపై అపార అనుభవమున్న వారిని, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కూడా కమిటీలో సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీ ఆరు నెలలకోసారి సమావేశమై చట్టం అమలు పురోగతిపై సమీక్షించనున్నట్లు వెల్లడించారు. వికలాంగు లపై వివక్ష ఏ రూపంలో ఉన్నా తొలగించాల్సిందేనని వారి అర్జీల పరిష్కారానికి ప్రతి శాఖ నోడల్ అధికారిని నియ మించాలని ఆదేశించారు. వారికి విద్య, వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. వారిలో నైపు ణ్యాలు పెంపొందించి వారు ఉపాధి అవకాశాలు పొందేలా, క్రీడల దిశగా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. కార్యా లయాల్లో వారు పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించాలన్నారు. పాఠశాలల్లో భవిత కేంద్రాలను పటిష్టం చేసేందుకు కషిచేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో విక లాంగులకు అందుబాటులో ఉన్న పథకాలు, కార్యక్రమాలపై అవగాహన పెంపొందించి, వాటిని సద్వినియోగం చేసు కునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ కృతికాశుక్లా సూచించారు. సమావేశంలో డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, ఐసిడిఎస్ పీడీ కె.ప్రవీణ, డిఎంహెచ్‌ఒ డాక్టర్ ఆర్.రమేష్, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ బి.విష్ణువర్ధిని, డిఎస్‌పి రాంబాబు, డిప్యూటీ డిఇఒ డేనియల్‌రాజు, జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్ వైడి రామారావు, ఉమా ఎడ్యుకేషనల్, టెక్నికల్ సొసైటీ ప్రతినిధి ఎస్.అప్ప లనాయుడు, మహర్షి సాంబమూర్తి, వికలాంగ బాలికల రెసి డెన్షియల్ స్కూల్ హెచ్‌ఎం ఎం.సుబ్బలక్ష్మి హాజరయ్యారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ కృతికా శుక్లా










