వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్
పటిష్టంగా ఓటరు జాబిత సవరణ
ప్రజాశక్తి-నెల్లూరు:ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించడంతో పాటు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.మంగళవారం ఉదయం విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమై ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా రీ వెరిఫికేషన్ ఆఫ్ డిలీషన్స్, రాజకీయ పార్టీలు సమర్పించిన చనిపోయిన, డూప్లికేట్, బోగస్ ఓట్ల జాబితాపై వివరణ, హౌస్ టు హౌస్ వెరిఫికేషన్, ఎపిక్ జనరేషన్ అండ్ స్టేటస్, పెండింగ్ లో ఉన్న ఫారం-6,7,8 వివరాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ ఛాంబర్ నుండి కలెక్టర్ యం. హరి నారాయణన్ పాల్గొని జిల్లాలో చేపడుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జనవరి 6, 2022 తేదీ నుంచి వచ్చిన డెత్, షిఫ్టింగ్ కేసులు అన్ని రీవెరిఫికేషన్ చేసి, నిర్దేశిత గడువులోపు రీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. రీ వెరిఫికేషన్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, తొలగింపులు కరెక్ట్ గా జరిగాయా లేదా అనేది ఇంటింటి పరిశీలన పటిష్టంగా చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తెలిపారు. కలెక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.










