Sep 30,2023 19:18

ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించిన ''జగనన్న ఆరోగ్య సురక్ష'' కార్యక్రమాన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో పటిష్టంగా అమలు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ ఆదేశించారు. నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక కిసాన్‌ నగర్‌, రైతు బజార్‌ రోడ్‌, వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలను కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను కమిషనర్‌ పరిశీలించారు. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ''జగనన్న ఆరోగ్య సురక్ష'' కార్యక్రమ అమలును అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం వైద్య సదుపాయాలు అవసరమైన అందరికీ చేరువయ్యేలా సిబ్బంది కషి చెయ్యాలి అని కమిషనర్‌ సూచించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌ శర్మద, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంకట రమణ, జిజియాబాయి, టి.పి.ఆర్‌.ఓ ప్రసాద్‌, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.