
ప్రజాశక్తి-నెల్లూరు :సుస్థిర అభివద్ధి లక్ష్యాలలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల ద్వారా క్షేత్ర స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు సంబంధిత డేటాను ఎప్పటి కప్పుడు ఆన్ లైన్లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం హరి నారాయణన్, అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ హరి నారాయణన్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులతో జిల్లాలో అమలు జరుగుతున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్షించి తగు సలహాలు,సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, సుస్థిర అభివద్ధి లక్ష్యాలలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖల ద్వారా క్షేత్ర స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతిపై ప్రతి వారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి గంగా భవాని, ఐసీడీఎస్ పిడి హేన సుజన, సిపిఓ రాజు, సమగ్ర శిక్ష ఎపిసి ఉషారాణి, ఇంచార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా ఖాదర్ వలి, డిసిహెచ్‌ఎస్ డా. రమేష్ నాథ్, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.