
ప్రజాశక్తి-పెద్దదోర్నాల : పెద్దదోర్నాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో ఉక్కు మనిషి సర్దార్ వల్లభారు పటేల్ జయంతి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లబారుపటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య మాట్లాడుతూ సర్దార్ వల్లబారు పటేల్ భారతదేశానికి అందింంచిన సేవల గురించి వివరించారు. సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించి అఖండ భారత దేశ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. అనంతరం విద్యార్థుల చేత జాతీయ ఐక్యత ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మందగిరి వర్ధన్, వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి, విజయ కుమారి, దేవమని ఎస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం : స్థానిక నలంద హైస్కూల్‌లో సర్దార్ వల్లభారు పటేల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ చిత్రపటానికి పూలమాలులు వేసి నివాళుర్పించారు. అనంతరం వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పద్మజా ఓబుల్‌రెడ్డి, కళాశాల ఎఒ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మార్కాపురం రూరల్ : మాజీ ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభారు పటేల్ స్ఫూర్తితోనే రక్షణ బలగాలు దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్నట్లు మార్కాపురం డిఎస్‌పి జి. వీర రాఘవరెడ్డి తెలిపారు. సర్దార్ వల్లభారు పటేల్ జయంతి పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత వల్లభారు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది దేశ సమైక్యత, సమగ్రతలకు అంకితభావంతో పాటు పడదామంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం 2 కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎం. భీమనాయక్, మార్కాపురం పట్టణ, గ్రామీణ ఎస్‌ఐలు పి.కోటేశ్వరరావు, ఎం.వెంకటేశ్వర నాయక్, ఎం.సువర్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.