Apr 03,2023 21:09

సంఘటనను పరిశీలిస్తున్న ఎస్‌ఐ, మాజీ జెడ్పిటిసి నాగిరెడ్డి

పశువులపాక దగ్ధం
ఆరు పశువులకు తీవ్ర గాయాలు
ప్రజాశక్తి - పగిడ్యాల

      అగ్ని ప్రమాదంతో పశువుల పాక దగ్ధమై ఆరు పశువులకు తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రం పగిడ్యాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. పగిడ్యాల గ్రామానికి చెందిన తెలుగు శేఖర్‌ పశువుల పాకలో 4 ఆవులు, రెండు ఎద్దులను కట్టివేశాడు. ప్రమాదవశాత్తు పాకలో మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి వెంటనే మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఆవులకు, ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు విషయాన్ని పశు వైద్య అధికారులకు తెలియజేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పశువులకు చికిత్స అందించారు. మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, ముచ్చుమర్రి ఎస్‌ఐ నాగార్జున సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న పశువులకు గాయాలు కావడంతో యజమాని శేఖర్‌ కన్నీరుమున్నీరయ్యాడు.