ప్రజాశక్తి-రేపల్లె: పశువుల కత్రిమ గర్భధారణపై పశుపోషకులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంత రావు అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం బేతపూడి గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసి జాతీయ కత్రిమ గర్భధారణ, లేగ దూడల ప్రదర్శనా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ గర్భం ద్వారా పుట్టిన లేగ దూడలను ప్రోత్సహించటానికి పశు పోషకులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియ ద్వారా వందకి తొంభై శాతం ఆడ దూడలు పుట్టే అవకాశం ఉందని అన్నారు. జాతీయ ఉచిత కుటుంబ గర్భధారణ కార్యక్రమం నాలుగో విడత జరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ నుంచి జులై 31 వరకు పశువులకు కృత్రిమ గర్భధారణ ఉచితంగా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ నరేంద్ర, మండల పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.










