Aug 18,2023 23:02

పశువైద్యశాలను సందర్శించిన రైతు సంఘం నాయకులు జొన్న శివశంకరరావు తదితరులు

తాడేపల్లి రూరల్‌: ఎంటిఎంసి పరిధిలోని చిర్రావూరు పశు వైద్య శాలలో పశువైద్యుని నియమించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం రైతు సంఘం నాయ కులతో కలిసి పశు వైద్యశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు పాడి రైతులు అనేక సమస్యలను రైతు సంఘం నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంద ర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ మండలంలో అత్యధి కంగా పాడి పశువులు కలిగి ఉన్న గ్రామ చిర్రావూరు అని, పాడి సంపద అధికంగా ఉన్న ఈ గ్రామంలో పాడినే జీవనా ధారం చేసుకొని అనేకమంది రైతులు జీవిస్తున్నారని చెప్పారు. పశువులకు వ్యాధులు వస్తే, ప్రైవేట్‌ డాక్టర్‌ పై ఆధారపడి వైద్యం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఇటీవల కాలంలో పాడి పశువులకు కొత్త వ్యాధులు సంభవించి, కాళ్లు పట్టుకుపోవడం, మేత సరిగా తినకపో వడం వలన పాడి రైతాంగం ఆందోళన చెందుతోందని చెప్పారు. పద్నాలుగేళ్ల క్రితం గ్రామంలో పశువైద్యశాల నిర్మించినప్పటికీ అక్కడ వైద్యుడిని నియమించకపోవడం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్య బట్టారు. తక్షణమే చిర్రావూరు లో పశు వైద్యుడిని నియ మించాలని, పశు సంపదను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, రైతు నాయకులు బొప్పన గోపాలరావు, మక్కపాటి రామారావు, మేడూరి పాములు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం తాడే పల్లి మండల అధ్యక్షులు పి.శివ నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం నాయకులు పి.సుబ్బారావు, డి వేణు,డి. శ్రీకాంత్‌, వి.బాజీ పాల్గొన్నారు.


కంచర్ల కాశయ్యకు పరామర్శ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎయిమ్స్‌ హాస్పిటల్‌లో ఆపరేషన్‌ చేయించుకొని డిశ్చార్జ్‌ అయిన సిపిఐ మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్యను శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌, ఎంటీఎంసీ పరిధిలోని కొలనుకొండలో ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సంద ర్భంగా కాశయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు.కాశయ్యను పరా మర్శించిన వారిలో సిపిఐ తాడేపల్లి ప్రాంత సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య,సిపిఎం నాయకులు పల్లె కృష్ణ,భక్తుల శాంసన్‌ ఉన్నారు.