దుగ్గిరాల: ఊహించని విధంగా అకస్మాత్తుగా పసుపు రేట్లు పెరిగాయని పసుపు సాగు చేస్తున్న రైతులు సాగు పెం చాలని దుగ్గిరాల వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ షేక్ బాజీ కోరారు. యార్డులో పసుపు అమ్మి న రైతులకు ప్రతి రోజు ఉచిత మధ్యాహ్న భోజనం అందించే పథకాన్ని సోమవారం ప్రారంభించారు. గతంలో ఈ పథకం ఉన్నప్పటికీ కరోనా కారణంగా 2019లో నిలిపివేశారు, తిరిగి సోమవారం నుండి ప్రవేశపెట్టారు. దూర ప్రాంతం నుండి యార్డుకు వచ్చిన రైతులు ఇబ్బంది పడకుండా ఈ పథకం ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపం వాణి జెడ్పిటిసి మేకతోటి అరుణ సర్పంచ్ బాణావత్ ఖుషి భారు మోరంపూడి సర్పంచ్ ఇత్తడి రమేష్ నాయకులు జానీ భాష యార్డ్ సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.










