May 15,2023 23:59

సంతలో పసుపు బస్తాలు

ప్రజాశక్తి- పెదబయలు: మండల కేంద్రంలో సోమవారం జరిగిన వారపు సంతలో పసుపు ధర భారీగా తగ్గింది. మూడు వారాల క్రితం కిలో పసుపు రూ.60 ఉండగా ఈ వారం రూ.40లకే విక్రయాలు జరిగాయి. దళారులు సిండికేట్‌గా మారడంతో ధరలు భారీగా తగ్గుతున్నాయి. మారుమూల ప్రాంతాల నుండి గిరిజనులు వాహనాల్లో సంతకు తెచ్చిన పసుపునకు గిట్టుబాటు ధర లేక పోవడంతో దిక్కుతోచని స్థితిలో గిరిజనులు ఆందోళన చెందారు. కనీసం రవాణా చార్జీలు కూడా రాలేదని వాపోయారు. అధికారులు దళారుల మోసాలను అరికట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపును జిసిసి కొనుగోలు చేయాలని సిపిఎం, గిరిజన సంఘాలు పలుమార్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా కనీసం స్పందించ లేదన్నారు.