రాయచోటి : జిల్లాలోని రైతులకు అందుబాటులో ఉండి పశువుల వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నానని పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పెళ్లై పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో పాడి రైతులు పశువుల పెంపకం ద్వారా పాలు దిగు బడితో అధిక లాభాలు, పశువుల వ్యాధుల ఎలా నివారించాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో తెలియజేశారు.
అన్నమయ్య జిల్లాలో పశు సంవర్ధక శాఖ కేంద్రాల వివరాలు తెలపండి?
జిల్లాలోని 6 నియోజకవర్గాలు, 30 మండలాలు, 3 డివిజన్లలో రాయచోటి, మదనపల్లె, రాజంపేటలో 3 ఉపసంచాలకులున్నారు.3 డివిజన్లో 15 మంది సహాయ సంచాలకులు (ఎడిలు), పశువైద్యాధికారులు 71 మంది, గ్రామీణ పశువైద్య అధికారులు 63 మంది ఉన్నారు.399 రైతు భరోసా కేంద్రాలలో పశువు వైద్య సహాయకులు, 116 మంది గోపాలమిత్రలున్నారు.
జిల్లాలో పశు సంపదలు వివరాలు తెలపండి ?
జిల్లా వ్యాప్తంగా తెల్ల పశువులు 2,76,417, గేదెలు 100588, గొర్రెలు18,24,325, మేకలు 3,53,370, కోళ్లు 23,82,260, కోళ్లఫారాలు మదనపల్లె, పీలేరు, కలికిరి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి.
పశువులకు ఎలాంటి వైద్య సేవలు అందజేస్తున్నారు?
ఇటీవల కాలంలో దాదాపు గొర్రెలు, మేకలకు సామూహిక నట్టల నివారణ మందులను తాగించాం. పశువైద్యు అధికారులు రైతుల దొడ్డలి దగ్గరికి వెళ్లి ఉచితంగా మందులు తాగించారు. దాదాపు జిల్లాలో 18 లక్షల గొర్రెలకు,3 లక్షల మందులు అందజేశాం. గొర్రెలు, మేకలు ఆరోగ్య పరీక్షలు , నీలి నాలుక వ్యాధి నివారణ కోసం టీికాలను సిద్ధంగా ఉంచాం.వైఎస్‌ఆర్ సంచార వైద్యం ద్వారా మారు మూల ప్రాంతాలలోని పశువులకు సేవలు అందిస్తారు. 1962 నెంబర్‌కు కాల్ చేస్తే తమ సిబ్బంది వ్యాన్‌లో రైతుల దగ్గరికి వెళ్లి వ్యాధిని బట్టి వాటికి మందులను అందజేస్తున్నారు.
చర్మ వ్యాధుల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
2019 సంవత్సరంలో కడపలో లంపు చర్మ వ్యాధుల నమోదు అయ్యాయి. 2021- 22 సంవత్సరానికి దాదాపు ఒక శాతం మాత్రమే పశువులు చర్మ వ్యాధుల బారన పడ్డాయి. జిల్లాలు ఎక్కడా పశువులు మరణించలేదు. ముందస్తు భాగంగా ఇప్పటివరకు 55,500 పశువులకు టీకాలు వేశాం. 2లక్షల 30 వేల టీకాలు పశువులకు వేశాం. వ్యాధిని అరకట్టేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో పశువుల సంతలను మూసి వేశాం. మదనపల్లె వంటి ప్రాంతాలలో చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల నుంచిి జిల్లా స్థాయి వరకు రైతులకు అనేక అవగాహన సదస్సును వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఎలాంటి చర్మ వ్యాధులు నమోదు కాలేదు. వైఎస్‌ఆర్ సంకర పశు వైద్య వాహనలు జిల్లాల్లో 13 ఉన్నాయి. నియోజకవర్గానికి 2 చొప్పున జిల్లా కేంద్రంలో 3 అందుబాటులో ఉన్నాయి.
గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి?
2022 - 23 సంవత్సరంలో 370 టన్నులు విత్త నాలు రైతులకు అందజేశాం. సంవత్సరాలు 2023 - 24 సంవత్సరానికి 500 టన్నులు 4 రకాల గడ్డి విత్త నాలు అందుబాటులో ఉన్నాయి. సిఎస్ హెచ్ - 24 ఎర్ర జొన్నలు, ఆఫ్రికన్ మొక్కజొన్నలు, అలసందలు, సజ్జలు అందుబాటులో ఉన్నాయి. 75 శాతం రాయితీతో అందజేస్తున్నాం.గడ్డి విత్తనాలను అన్ని రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంచాం.
నిరుద్యోగులు ఉపాధి ఆదాయం పొందవచ్చా ?
గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగులు, విరమణ పొందిన ఉద్యోగులు ఇతరులు జిల్లాలో పాడి పరిశ్రమ ఎంతో ఉపయోగపడుతుంది. పాడి పెంపకం ద్వారా పాలతో ఆర్థిక లాభాలు సాధించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాల డెయిరీలు అందుబాటులో ఉన్నాయి. పాల వ్యాపారంతో అధిక దిగుబడి సాధించవచ్చు. దీని వల్ల నిరుద్యోగ ఉపాధి కలుగుతుంది.
రైతులు అధిక దిగుబడి సాధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కత్రిమ గర్భత్పోత్తి ద్వారా సంకర జాతి దూడను పొంది మంచి పాడి పశువుల ద్వారా అధిక పాలు ఉత్పత్తిని సాధించవచ్చు. జగనన్న పాలవెల్లువ కింద కొన్ని గ్రామాలను చేర్చి, గిట్టుబాటు ధరను కల్పి స్తున్నాం. పశుదానా వినియోగం, మూడు రకాల పచ్చ గడ్డలు మార్గం ద్వారా విధిగా ఎండ గడ్డి, వ్యాధి నివారణకు పశుసంవర్ధక శాఖ సలహాలు, సూచనలు ఇస్తున్నాం. ప్రస్తుతం రోజుకు దాదాపు 40 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుంది.










