Jun 24,2023 00:00

చీడికాడలో మాట్లాడుతున్నఅధికారులు

ప్రజాశక్తి -చీడికాడ:మండల కేంద్రంలోని పశు వైద్య కార్యాలయం వద్ద వైయస్సార్‌ బీమా పై పశువైద్యాధికారిణి గాయత్రిదేవి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు బి. ప్రసాదరావు మాట్లాడుతూ, మగ పశువులకు కూడా బీమా వర్తిస్తుందన్నారు. మూడేళ్లకు 30,000 భీమాకు గాను రైతు రూ.384 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. వి.మాడుగుల పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు వి.చిట్టి నాయుడు మాట్లాడుతూ, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జిల్లా నోడల్‌ అధికారి , బాను బాబు పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌: స్థానిక ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు రాంబాబు ఆధ్వర్యంలో గొలుగొండ, నర్సీపట్నం మండలాలకు సంబంధించిన రైతులతో స్థానిక పశు వైద్యశాలలో వైయస్సార్‌ పశు బీమాపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా పశువైద్యాధికారి ప్రసాద్‌ రావు పాడి రైతులతో ఇష్టా గోష్టి చర్చ నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న పశు బీమా పథకంను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు, పశు సహాయకులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు.