
ప్రజాశకి-విజయనగరం కోట : చంద్రబాబు నాయుడు పై పసలేని కేసులు పెట్టి వేధిస్తున్నారని టిడిపి నాయకులు మండిపడ్డారు. శుక్రవారం బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా నగరంలోని స్టేట్‌బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుండి కన్యకా పరమేశ్వరి కోవెల వరకు బాబుతో నేను కరపత్రాలు పంచుతూ ప్రతి ఒక్కరిని ఒక మిస్డ్ కాల్ ఇచ్చి సపోర్ట్ చేయమని కోరారు. 73ఏళ్ల వయసు కలిగిన చంద్రబాబును ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈనేపథ్యంలో ప్రజలంతా చంద్రబాబుకు మద్దతుప పలకాలని కోరారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, నగర అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యాలయ కార్యదర్శి వర్మ రాజు, కోండ్రు శ్రీనివాసరావు, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల : మండలంలోని ఒమ్మి గ్రామంలో టిడిపి ఆధ్వర్యాన 'బాబుతో నేను' కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగింది. మండల టిడిపి అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజక వర్గం ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు పాల్గొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు పై కర పత్రాలు పంపిణీ చేసి రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలోజిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు టిడిపి ఎస్‌సి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతల రాజప్పన్న, నాయకులు ఆల్తి నల్లి బాబు, దన్నాన రామ్మూర్తి, రెడ్డి నారాయణ రావు తదితరులు పాల్గోన్నారు.