Sep 09,2023 23:40

ప్రజాశక్తి - చీరాల
ఎన్ ఆర్ అండ్ పిఎం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఓ పసిబిడ్డ వైద్య ఖర్చుల నిమిత్తం మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం రూ.30వేల ఆర్థిక సాయాన్ని పసిబిడ్డ తండ్రికి అందజేశారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ రెయిన్బో హాస్పిటల్‌లో 16నెలల హనీష్ చిన్నారి కిడ్నీ, లివర్, మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. చిన్నారి తండ్రి కంకణంపాటి నరేంద్ర ఈపాటికి రూ.6లక్షలకుపైగా వైద్యం చేయిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా వైద్య ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులను ఆశ్రయించారు. వైద్యానికి సంబంధించిన రిపోర్టులు, చికిత్స పొందుతున్న చిన్నారి ఫోటోలను చూసి వెంటనే స్పందించారు. దీంతో చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం తమ వంతు మానవత్వంతో బాధ్యతగా రూ.30వేల నగదును అందచేశారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అమరా వీరాంజనేయులు, పోలుదాసు రామకృష్ణ, వలివేటి మురళీకృష్ణ, డేగల తిరుపతిరావు, చింతా రమేష్, శీరాం రమేష్, సుభాషిణి, చారుగుళ్ళ ప్రసాద్, వెంకటస్వామి, మామిడాల శ్రీనివాసరావు, భాస్కర్, నారాయణరావు, నారాయణమూర్తి పాల్గొన్నారు.