ప్రజాశక్తి-కొనకనమిట్ల : పశ్చిమ ప్రకాశం ప్రాంతంపై వైసిపి సవతి తల్లి ప్రేమ చూపుతోందని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మార్కాపురం మాజీ ఎమ్మెల్య కందుల నారాయణరెడ్డి చేపట్టిన ప్రజాచైతన్యయాత్ర ఐదో రోజూ గురువారం మండల పరిధిలోని బచ్చలకూరపాడు, సిద్ధవరం, కొనకనమిట్ల, ఎదురాళ్ళపాడు, తువ్వపాడు గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముత్తుముల అశోక్‌రెడ్డి పాల్గొని కందుల నారాయణరెడ్డికి సంఘీ భావం తెలిపాడు. అనంతరం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రాయలసీమను అభివృద్ధి చేస్తూ పశ్చిమ ప్రకాశం ప్రాంతంపై సవతి తల్లి ప్రేమను చూపడమేంటని ప్రశ్నించారు. శ్రీపూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, మార్కాపురం జిల్లా ఏర్పాటులోనూ వివక్షత చూపారన్నారు. మాట తప్పను-మడమ తిప్పనని ప్రలోభాలు పలుకుతూ పశ్చిమ ప్రాంత ప్రజలను మోసం చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వైసిపి అధికారంలో ఉన్నప్పటికీ మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడంలోనూ రాజకీయం చేశారని విమర్శించారు. నియోజకవర్గాన్ని మామ అల్లుళ్లు విభజించి పాలిస్తున్నారన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ మోరబోయిన బాబూరావు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కామసాని రామిరెడ్డి, పొదిలి ఎఎంసి మాజీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య, వెలుగొండ ఆలయ మాజీ చైర్మన్ కుందురు కాశిరెడ్డి, టిడిపి జిల్లా కార్యదర్శి గౌస్‌బాషా, టిడిపి మండల మాజీ కన్వీనర్లు కనకం నరసింహారావు, వరికూటి వెంకటరామిరెడ్డి, నాయకులు కె.రామిరెడ్డి, సాల్మన్, రోశయ్య, కరిదెర నాసరయ్య, పి.సుఖదేవ్, బాషాపతి నాయుడు, కాటంరాజు, పి.వెంకటేశ్వరరెడ్డి, బయ్యా నాగేశ్వరరావు, వేంపాటి శ్రీకాంత్‌రెడ్డి, బరిగె బాలయ్య, నరసింహారావు, రమణారెడ్డి, డేవిడ్, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.










