Mar 13,2023 22:50

ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి నియోజకవర్గంలోని ఆయా డివిజన్ల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అధికారులతో కలసి సోమవారం సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లకు సంబంధించి చేపట్టవలసిన అభివద్ధి పనుల వివరాలు, ప్రజలకు ఎదురౌతున్న పలు ఇబ్బందులను అధికారుల దష్టికి తీసుకువచ్చిన సందర్బంలో డివిజన్లలో టెండర్లు ఆమోదించిన పనులను వెంటనే ప్రారంభించాలని, నిర్మాణంలో ఉన్న పనులు వేగవంతము చేసి పూర్తి చేయునట్లుగా చూడాలని కోరారు. డ్రెయిన్లు, త్రాగు నీటి సరఫరా, వీది దీపాల నిర్వహణ వంటి పలు సమస్యలను తక్షణమే పరిష్కారించునట్లుగా చూడాలని అన్నారుఈ సందర్బంలో గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా క్షేత్ర స్థాయిలో డివిజన్లలో పర్యటించిన నేపధ్యంలో ప్రధానంగా రోడ్లు, డ్రెయిన్లు, త్రాగు నీటి సరఫరా, కొండ ప్రాంతాలలో మెట్ల మార్గం వంటి పలు ప్రధాన సమస్యలను ప్రజలు తమ దష్టికి తీసుకొచ్చారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌కు వివరించారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ఎదురౌతున్న ఇబ్బందులకు సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఇంజనీర్‌ యం.ప్రభాకరరావు, సిటీ ప్లానర్‌ జి.వి.జి.ఎస్‌.వి ప్రసాద్‌, ఎగ్జీక్యూటివ్‌ ఇంజనీర్లు, నారాయణమూర్తి, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సురేష్‌బాబు పాల్గొన్నారు.