Sep 11,2023 00:08

ప్లాస్టిక్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌ తదితరులు

ప్రజాశక్తి -మధురవాడ : డిఆర్‌డిఒ సహకారంతో పృధ్వీ బయోప్లాస్టిక్‌ ప్లాంట్‌ను ఆదివారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎకో వైజాగ్‌కు మద్దతుగా ప్లాస్టిక్‌ రహిత ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి నాంది పలికిందన్నారు. విశాఖలో ఇప్పటికే ప్లాస్టిక్‌ను నివారించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, వాటి ఫలితంగా అనేక అవార్డులు కూడా వచ్చాయని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సాగరంలో కొన్ని వేల టన్నులు చెత్త పేరుకుపోతోందని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాలను దిగుమతి చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, కంపెనీ సిఇఒ వి.పేరప్రసాద్‌, డిఆర్‌డిఒ ప్రాజెక్టు డైరెక్టర్‌, సైంటిస్ట్‌ ఎఫ్‌కె.వీరబ్రహ్మం, మాజీ డిప్యూటీ మేయర్‌ దొరబాబు, మాజీ కార్పొరేటర్‌ పోతిన హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.